: 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా... శతకం బాదిన రోహిత్ శర్మ
కొలంబో వేదికగా జరుగుతోన్న శ్రీలంక, టీమిండియా నాలుగో వన్డే మ్యాచులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ శతకం బాదాడు. అనంతరం 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాథ్యూస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 4 పరుగులకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 బంతుల్లో 131 పరుగులు చేసి మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా కూడా 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మథ్యూస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లోకేశ్ రాహుల్ 2, మనీష్ పాండే 1 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 36 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 266 గా ఉంది.