: పోప్ ఫ్రాన్సిస్ ముందే ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఘనుడు
తన ప్రియురాలితో కలిసి పోప్ ఫ్రాన్సిస్ సమావేశానికి వాటికన్ సిటీకి వెళ్లాడు వెనిజులాకు చెందిన న్యాయవాది దారియో రామిరెజ్. సమావేశంలో భాగంగా పోప్‌ను కలవడానికి ఆమెతో కలిసి వేదిక మీదకి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఒక్కసారిగా జేబులో ఉన్న ఉంగరం తీసి, మోకాళ్ల మీద కూర్చుని `నన్ను పెళ్లి చేసుకుంటావా?` అంటూ ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు రామిరెజ్.
అనూహ్యమైన ఈ సంఘటనతో సమావేశానికి విచ్చేసిన వారితో పాటు పోప్ ఫ్రాన్సిస్ కూడా షాక్ తిన్నాడు. తర్వాత వెంటనే తేరుకుని నవ్వుతూ వాళ్లను ఆశ్వీరదించాడు. అక్కడ ఉన్న వాళ్లంతా లేచి చప్పట్లు కూడా కొట్టారు. ఈ సంఘటనను ఇటలీ మీడియా ఓ అరుదైన సంఘటనగా ప్రచారం చేస్తోంది. ప్రత్యేకంగా ప్రపోజ్ చేస్తే తన విజ్ఞప్తిని అంగీకరిస్తుందనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు రామిరెజ్ చెప్పాడు.