: రేపట్నుంచి విజయవాడలో హెల్మెట్ కంపల్సరీ.. లేకపోతే తాట తీస్తారు


విజయవాడలో రేపట్నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి కానుంది. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ను కచ్చితంగా ధరించాల్సిందేనని డీసీపీ కాంతిరాణా తెలిపారు. హెల్మెట్ లేకుండా మొదటిసారి దొరికితే రూ. 100 జరిమానా విధించి వదిలేస్తామని చెప్పారు. మళ్లీ మళ్లీ హెల్మెట్ లేకుండా దొరికితే జరిమానా కూడా పెరుగుతూ పోతుందని... అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని తెలిపారు. విజయవాడలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని... ప్రమాదానికి గురవుతున్నవారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులేనని చెప్పారు.

  • Loading...

More Telugu News