: ప్రధానితో సమావేశంలో తన వస్త్రధారణపై మొదటిసారి నోరువిప్పిన ప్రియాంక చోప్రా!
ప్రధాని నరేంద్రమోదీతో సమావేశానికి మోకాళ్ల వరకు ఉండే వస్త్రాలు ధరించి హాజరవడంపై ప్రియాంకచోప్రా మీద నెటిజన్లు విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వారికి సమాధానంగా కురచ దుస్తులు ధరించి మరో ఫొటోను ప్రియాంక పోస్ట్ చేసిన విషయం గుర్తుంది కదా!... ఇప్పుడు అదే విషయంపై మొదటిసారిగా ప్రియాంక నోరు విప్పింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రియాంక ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది.
`నెటిజన్లకు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. వారు చేసే హేళనకు మీడియా ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆన్‌లైన్లో హేళన చేయడమనేది అసలు వార్త కానే కాదు. అది నా మీద వారికి ఉండే వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అలాంటివి నేను పెద్దగా పట్టించుకోను` అని ప్రియాంక సమాధానమిచ్చింది. అయితే ఇదే వివాదంపై ప్రియాంక తల్లి మధు చోప్రా - `ఆరోజు ప్రధాని సమావేశానికి వెళ్లడానికి దుస్తులు మార్చుకునే సమయం లేకపోవడంతో, ప్రోటోకాల్ అధికారుల సూచన మేరకే ప్రియాంక అలా వెళ్లింది` అంటూ గతంలో సంజాయిషీ ఇచ్చిన సంగతి విదితమే.