: మూడు టోర్నడోలను తృటిలో తప్పించుకున్న రష్యా విమానం... వీడియో చూడండి
సముద్రం మీద ఏర్పడే సుడిగుండాల్లో చిక్కుకోకుండా రష్యన్ పైలట్ విమానాన్ని జాగ్రత్తగా నడిపాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సుడిగుండాలు విమానం వెనకాలే ఉన్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. రష్యాలోని సోచి నగర సరిహద్దుల్లో ఈ వీడియోను రికార్డు చేశారు. నల్ల సముద్రం తీరం గుండా పన్నెండు వరకు టోర్నడోలు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా టోర్నడోల తాకిడి అధికంగా ఉన్నపుడు విమాన ప్రయాణాలను రద్దు చేస్తారు. కొన్ని సార్లు మాత్రం అకస్మాత్తుగా ఏర్పడే టోర్నడోల ఉనికి శాటిలైట్లు గుర్తించలేవు. అలాంటి సమయాల్లో కొన్ని విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతాయి.