: మూడు నెలల్లో సమగ్ర భూ సర్వే: సీఎం కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల్లో సమగ్ర భూ సర్వే నిర్వహించాలని కలెక్టర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమగ్ర భూ సర్వే విషయమై కలెక్టర్లతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.

రెండు దశల్లో భూ సర్వే నిర్వహించాలని, మొదటి దశలో వివాదం లేని భూములపై స్పష్టత ఇవ్వాలని, రెండో దశలో కోర్టు వివాదంలో ఉన్న భూములను గుర్తించాలని సూచించారు. కోర్టు తీర్పులను అనుసరించి ఈ భూవివాదాలను పరిష్కరించాలని, భూ రికార్డుల సరళీకరణకు రూ.15 కోట్లు విడుదల చేశామని, హైదరాబాద్ మినహా ఒక్కో జిల్లాకు రూ.50 లక్షల చొప్పున కేటాయించినట్టు కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News