: కొలంబో వన్డే: దుమ్ము రేపుతున్న విరాట్ కోహ్లీ
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో కేవలం ఆరు పరుగులకే టీమిండియా ధావన్ వికెట్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ ధావన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మకు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే కెరియర్లో 45వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 102 పరుగులు. శర్మ 36, కోహ్లీ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు.