: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రస్తుతం వన్డే మ్యాచులు ఆడుతున్న టీమిండియా ఈ రోజు నాలుగో వన్డే ఆడుతోంది. కొలంబో వేదికగా కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్‌లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ ఇప్పటికే మూడు మ్యాచులు గెలిచి, సిరీస్‌ను కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. కాగా, మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆశిస్తోన్న శ్రీలంక... జట్టులో మార్పులు చేర్పులతో బరిలోకి దిగింది. భారత జట్టులో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మనీష్ పాండేలకు చోటు దక్కింది. ఛాహల్, జాదవ్, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతి ఇచ్చారు.