: ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్... టాప్ 10లోకి తిరిగొచ్చిన డేవిడ్ వార్నర్.. కోహ్లీని బీట్ చేసిన పుజారా!
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజా టెస్ట్ బ్యాట్స్ మన్, బౌలర్ ర్యాంకులను ప్రకటించింది. ఆ ర్యాంకింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. టెస్టుల్లో టాప్ టెన్ లోకి డేవిడ్ వార్నర్ తిరిగొచ్చాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పుజారా దాటాడు. లోకేష్ రాహుల్ కూడా టాప్-10కు ప్రమోట్ అయ్యాడు. మిగతా వివరాలు ఇవి...
టెస్ట్ బ్యాట్స్ మన్ ర్యాంకుల్లో టాప్ 10లో వరుసగా స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జోయ్ రూట్ (ఇంగ్లండ్), కే విలియమ్సన్ (న్యూజిలాండ్), ఛటేశ్వర్ పుజారా (ఇండియా), విరాట్ కోహ్లీ (ఇండియా), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), అజార్ అలీ (పాకిస్థాన్), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), హషీమ్ ఆమ్లా (సౌతాఫ్రికా), లోకేష్ రాహుల్ (ఇండియా) ఉన్నారు.
టెస్ట్ బౌలర్ల ర్యాంకుల్లో టాప్ 10లో వరుసగా, రవీంద్ర జడేజా (ఇండియా), జే ఆండర్సన్ (ఇంగ్లండ్), రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా), ఆర్ హెరాత్ (శ్రీలంక), జే హాజెల్ వుడ్ (ఆస్ట్రేలియా), కే రబాడా (సౌతాఫ్రికా), డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా), వీ ఫిలాండర్ (సౌతాఫ్రికా), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)లు ఉన్నారు.
టెస్టు ఆల్ రౌండర్లలో టాప్ 5లో వరుసగా షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), రవీంద్ర జడేజా (ఇండియా), రవిచంద్రన్ ఆశ్విన్ (ఇండియా), మొయిన్ అలీ (ఇంగ్లండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.
నోట్: ఈ జాబితా ఆగస్ట్ 31 నాటిది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు, ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ ముగిసిన తరువాతి ర్యాంకులివి.