: అదుపుతప్పి ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్ వైపు దూసుకెళ్లిన కారు
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఓ కారు అదుపుతప్పి ఔట్ పేషెంట్ బ్లాకు వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు రోగులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. సదరు ఆసుపత్రి వైద్యుడు కారులో వచ్చి, దాన్ని పార్క్ చేయమని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడని వెల్లడించారు. ఆ వ్యక్తి కారుని పార్క్ చేసే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. గాయాలపాలయిన రోగుల పేర్లు ఉమర్, ఇక్బాల్, కౌసర్ అని చెప్పారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కారు నడిపిన సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసినట్లు చెప్పారు.