: టీటీడీ కీలక నిర్ణయానికి చంద్రబాబు ఓకే... అదనంగా 9 వేల మందికి దర్శన భాగ్యం!


దేవదేవుడు కొలువున్న తిరుమలలో మరింత మంది సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించాలన్న దిశగా గత రెండు నెలలుగా టీటీడీ చేస్తున్న ప్రయత్నాలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇకపై ప్రొటోకాల్ మేరకు మాత్రమే ఎల్-1 దర్శనాలకు అనుమతించాలని, ఎల్ 2, ఎల్ 3 సిఫార్సులను ఒకటిగా పరిగణించాలని టీటీడీ కీలక నిర్ణయాన్ని చంద్రబాబు వద్ద ప్రతిపాదించగా, ఆయన ఓకే చెప్పారు. దీంతో ఒక రోజుకు అదనంగా మరో 9 వేల మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కలుగనుంది.

కాగా, ప్రొటోకాల్ వర్తించే వీవీఐపీలను ఎల్ 1 లేఖల కింద ఆలయంలో కులశేఖరపడి వరకూ అనుమతించి, హారతి, తీర్థం, శఠారి ఇచ్చి పంపుతారు. ఇప్పటివరకూ భక్తులు అధికంగా వచ్చే శని, ఆదివారాల్లో మాత్రమే కచ్చితమైన ప్రొటోకాల్ పద్ధతి పాటిస్తుండగా, ఇకపై ప్రతి రోజూ వర్తించనుంది. ఇక ఎల్ 1 వీఐపీలు రోజుకు 100 నుంచి 150 మంది మాత్రమే తిరుమలకు వస్తుండటంతో బ్రేక్ దర్శనం అరగంటలోనే పూర్తయి పోతుందని, ఎల్ 2, ఎల్ 3లను ఒకేలా పరిగణించి, వారిని కులశేఖరపడి వరకూ పంపి, హారతి తదితరాలు లేకుండానే పంపేయనున్నామని, దీనివల్ల అదనంగా దాదాపు రెండు గంటల సమయం సాధారణ భక్తులకు కేటాయించవచ్చని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News