: 'అర్జున్ రెడ్డి'పై యాంకర్ అనసూయ ట్వీట్ల వార్!


సూపర్ హిట్ చిత్రం 'అర్జున్ రెడ్డి'పై విమర్శలు గుప్పిస్తున్న వారిలో యాంకర్ అనసూయ కూడా చేరిపోయింది. సినిమాలో కొన్ని బూతు పదాలు వాడారని ఆరోపించిన అనసూయ, ఎవరినో తిట్టే క్రమంలో అమ్మను ఉద్దేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాను తాను చూడలేదని, చూసే ధైర్యం లేదని చెప్పింది. ఓ మహిళను రాయలేని పదాలతో తిట్టడం ఏంటని మండిపడింది. టాలెంట్ ఉన్న ఓ చిత్ర యూనిట్ మంచిని, నీతిని, విలువలను చెప్పాలే తప్ప ఇదేం పనని విరుచుకుపడింది. సినిమా తొలి లుక్ ను చూసి తానెంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ డైలాగులు వినే ధైర్యం కూడా చేయలేకపోతున్నానని అంది.

  • Loading...

More Telugu News