: రాంచరణ్ కుర్తాల వెనుక కథ ఇదే!


టాలీవుడ్ మెగా వారసుడు రాంచరణ్ ఎక్కడికి వెళ్లినా కుర్తాలు ధరించి వెళ్తున్నాడట. దీంతో ఎప్పుడూ జీన్స్, టీషర్టులలో కనిపించే రాంచరణ్ కుర్తాలు ధరించడం అభిమానుల్లో చర్చను రేపింది. దీని వెనుకున్న రహస్యం ఇప్పుడు వెలుగు చూసింది. రాంచరణ్ ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆయన రాజమండ్రికి వెళ్లాడు. అయితే అక్కడ ఎండల వేడిమికి తట్టుకోలేకపోయాడు. దీంతో వెంటనే బ్రాండెడ్ కుర్తాల కోసం ప్రయత్నించాడు. అవి దొరకకపోవడంతో మంచి కాటన్ వస్త్రాలను ఆరు రంగుల్లో కొనుగోలు చేసి దానితో కుర్తాలు కుట్టించుకున్నాడు. అవి చాలా సౌకర్యవంతంగా ఉండడంతో పాటు, మోడ్రన్ గా కనిపించడంతో రాంచరణ్ కి అవి నచ్చాయి. దీంతో అప్పటి నుంచి రాంచరణ్ ఎక్కడకి వెళ్లినా కుర్తాలను వేసుకెళ్తున్నాడు. 

  • Loading...

More Telugu News