: బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు తప్పుడు వార్తలే... ఇసుమంతైనా నిజం లేదు!: మేకపాటి వివరణ


తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలపై పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఓ టీవీ చానల్ తో కొద్దిసేపటి క్రితం మాట్లాడిన ఆయన, ఇంత దౌర్భాగ్యపు వార్తలు ఎలా వస్తాయో తెలియడం లేదని అన్నారు. ఈ విషయంలో ఇసుమంతైనా నిజం లేదని స్పష్టం చేశారు.

"ఈ మధ్యాహ్నం ఉదయగిరి నుంచి నాకు ఎవరో ఫోన్ చేశారు. ఏంటి సార్, ఇలా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అని. దీనెమ్మ బడవా అని... నేనూ అతనితో కాస్త కఠినంగానే మాట్లాడా. అతను నాకు బాగా తెలిసిన శ్రేయోభిలాషే. ఇంతకుముందు ఇంకొకతను కూడా వచ్చి అదే మాట అన్నాడు. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు. ఎట్లా వస్తాయో ఇటువంటి వార్తలు" అని మేకపాటి తెలిపారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసినప్పుడు సోనియాగాంధీ మహారాణిగా వెలుగొందుతున్నారని, ఆ సమయంలోనే తాను వైకాపాలో చేరానని గుర్తు చేశారు. వ్యాపారాలు చేసుకునే తన కుమారులు అప్పుడప్పుడూ తనకు డబ్బులిస్తుంటారని, కుటుంబ వ్యాపారానికి, తన రాజకీయ జీవితానికి సంబంధం లేదని అన్నారు. అధికార దుర్వినియోగంతోనే నంద్యాలలో టీడీపీ గెలిచిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News