: పిల్లలు చనిపోతుంటే ప్రభుత్వానిదా బాధ్యత?: కలకలం రేపుతున్న యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరుగుతున్న చిన్నారుల మరణాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 290 మంది చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, దీనిపై యోగి మాట్లాడుతూ, "పిల్లలకు రెండు సంవత్సరాలు రాగానే, వారి బాధ్యతంతా ప్రభుత్వానిదే అన్నట్టు తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారి బాధ్యతలను ప్రభుత్వంపై వేస్తున్నారు. పిల్లలు చనిపోతుంటే, ప్రభుత్వానిదా బాధ్యత?" అని ప్రశ్నించారు.

ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను గాలికి వదిలేస్తున్నారని ఓ మీడియా చానల్ స్టింగ్ ఆపరేషన్ చేయడంపైనా యోగి మండిపట్టారు. మీడియా ఒక్కోసారి చెత్త వార్తలను ప్రసారం చేస్తోందని విమర్శించారు. బీఆర్డీ ఘటనలపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తరువాత చర్యలుంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News