: 4 కోట్లు వెనక్కి ఇచ్చిన బాలీవుడ్ హీరో!


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ నిర్మాత నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేసి ఆకట్టుకున్నాడు. ‘రా (raw-రెమో అక్బర్‌ వాల్టర్‌)' సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన పనుల వల్ల ఈ సినిమాలో నటించలేకపోతున్నానని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రకటించాడు. దీంతో ఈ సినిమా రెమ్యూనరేషన్ లో భాగంగా తీసుకున్న 4 కోట్ల రూపాయలను తిరిగి నిర్మాతకు చెల్లించాడు.

సాధారణంగా ఇలా సినిమాల్లో నటించేందుకు తీసుకున్న డబ్బులు చెల్లించేందుకు కొందరు నటులు ఇష్టపడరని, ఏదో ఒక రకంగా వారికి కాల్షీట్స్ ఇచ్చి, నటించేస్తారని, సుశాంత్ అలా చేయకుండా తిరిగి డబ్బులు ఇచ్చేశాడని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రస్తుతం ‘కేదార్‌ నాథ్‌’, ‘చందమామ దూర్‌ కే’ సినిమాలతో పాటు అభిషేక్‌ చౌబే దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తున్నాడు. కాగా, తాజాగా ఆయన నటించిన ‘రబ్తా’ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News