: ముంబైలో కుప్పకూలిన వందేళ్ల నాటి భవనం.. శిధిలాలకింద చిక్కుకున్న నివాసితులు


ముంబైలోని ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముంబైని గత వారం రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని జేజే సెంటర్ లోని భిండీ బజార్ లో వందేళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే పోలీసు, మున్సిపల్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలకు దిగారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీయగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డవారిని శిథిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News