: రైల్వే మంత్రి తలరాత తేలేది రేపే
మేనల్లుడు విజయ్ సింగ్లా లంచం పుచ్చుకుంటూ సిబిఐకి దొరికిపోవడం బన్సల్ కుర్చీకి ఎసరు తెచ్చింది. ఇంటా, బయటా అన్ని పక్షాలూ రైలు మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తుండడంతో.. బన్సల్ రాజీనామా చేయడానికి సిద్ధమేనని అదిష్ఠానానికి చెప్పేశారు. ఈ నేపథ్యంలో బన్సల్ రాజీనామాను కాంగ్రెస్ సోమవారం ఉదయంలోగా తేల్చేస్తుందని పార్టీ వర్గాల సమాచారం. నేటి సాయంత్రంతో కర్ణాటక ఎన్నికలు ముగుస్తాయి. ఆ వెంటనే కోర్ కమిటీ సమావేశమై బన్సల్ రాజీనామాపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.