: కృష్ణమ్మకు పెరుగుతున్న జలకళ... భారీగా వస్తున్న వరదనీరు
ఈ సీజన్ లో తొలిసారిగా కృష్ణానదిలో జలకళ కనిపిస్తోంది. కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్రకు భారీగా వరదనీరు వస్తోంది. మరోవైపు గతంలో కురిసిన వర్షాలకే ఆల్మట్టి పూర్తిగా నిండిపోగా, వస్తున్న వరద నీటిలో అత్యధిక భాగాన్ని కిందకు వదులుతున్నారు. 129 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఆల్మట్టిలో ఇప్పటికే 126 టీఎంసీల నీరు చేరింది. 27,885 క్యూసెక్కుల నీరు బ్యారేజ్ లోకి వస్తుండగా, సుమారు 18 వేల క్యూసెక్కుల కిందకు వదులుతున్నారు. నారాయణపూర్ నీటి నిల్వ సామర్థ్యం 37.65 టీఎంసీలు కాగా, 34.70 టీఎంసీలకు నీరు చేరుకుంది. 18,700 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7,613 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఉదయం జూరాలకు 9,766 క్యూసెక్కులు, తుంగభద్రకు 23,438 క్యూసెక్కులు, శ్రీశైలానికి 4,687 క్యూసెక్కుల నీరు వస్తోంది.