: పవన్ కల్యాణ్ ను కలవాలంటూ యువతి హంగామా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు


టాలీవుడ్ లో ప్రముఖ నటుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను కలవడానికి పలువురు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పవన్ కల్యాణ్ ను కలవాలని చెబుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం ముందు హంగామా చేసిన ఘటన చోటుచేసుకుంది.

 జ్యోతి అనే సదరు మహిళ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని, అంతే కాకుండా ఆమెకు మానసిక సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఆయన నివాసం ముందుకు వచ్చింది. తాజాగా నిన్న ఆయన నివాసం ముందుకు వచ్చిన ఆమె నానా హంగామా చేసింది. దీంతో పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి సదరు యువతిని స్టేషన్ కు తీసుకెళ్లారు. 

  • Loading...

More Telugu News