: 2008 నుంచి ఇప్పటి వరకు 72 మంది ఇండియన్ మిలియనీర్లు బ్రిటన్ చెక్కేశారు.. వెల్లడించిన యూకే


గత తొమ్మిది సంవత్సరాల్లో భారత్ నుంచి 72 మంది మిలియనీర్లు, 84 మంది డిపెండెంట్లు యూకేకు వలస వచ్చినట్టు బ్రిటన్ హోమ్ వ్యవహారాల కార్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల కోసం మంజూరు చేసే టైర్-1 (ఇన్వెస్టర్) వీసా ద్వారా 2 మిలియన్లు, అంతకంటే ఎక్కువ పౌండ్లు పెట్టుబడిగా పెడతామని హామీ ఇస్తూ వీరంతా బ్రిటన్ చేరుకున్నారు. కాగా, 2013లో 16 మంది భారత మిలియనీర్లు బ్రిటన్‌కు వెళ్లిపోగా ఇప్పుడు ఏకంగా 72 మంది బ్రిటన్ చెక్కేశారు. భారతీయుల తర్వాత చైనా, రష్యా, అమెరికాకు చెందిన మిలియనీర్లు టైర్-1 వీసాను ఎక్కువగా తీసుకున్నారు. వీసా పొందిన వారి జాతీయత తప్ప ఇతర వివరాలు వెల్లడించేందుకు బ్రిటన్ నిరాకరించింది.

  • Loading...

More Telugu News