: రిసార్ట్ నుంచి బయటకు రానున్న దినకరన్ ఎమ్మెల్యేలు


పన్నీర్ సెల్వం తన వర్గాన్ని అన్నాడీఎంకేలో కలిపేసి, డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రిసార్ట్ కు పరిమితమైన దినకరన్ వర్గానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేడు రిసార్ట్ ను వీడనున్నారు. శశికళ, టీటీవీ దినకరన్ లను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన తన మద్దతుదారు ఎమ్యెల్యేలతో రిసార్ట్ కు చేరారు. అప్పటి నుంచి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడదోస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరితో కలిసి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిసి మెమొరాండం ఇచ్చారు.

 అయితే పార్టీ అంతర్గత వ్యవహారంలో తాము తలదూర్చమని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఈ ప్రభుత్వం తనకు నచ్చలేదని, తక్షణం దీనిని అధికారం నుంచి తొలగించి, తాము సూచించిన వారితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతిని కలిసేందుకు వారంతా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా రిస్టార్ ను వీడనున్నారు. 

  • Loading...

More Telugu News