: సినీ కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు...అందుకే డ్రగ్స్ తీసుకుంటారు: వర్ధమాన నటుడు
సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదని అందుకే డ్రగ్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారని నటుడు అభినయ్ దర్శన్ తెలిపాడు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో బెత్లెహామ్ ప్రార్థనా మందిరంలో జరిగిన ఉజ్జీవ సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలా మనశ్శాంతి లేకపోవడంతో హిమాలయాలు వంటి ప్రాంతాలకు దానిని వెతుక్కుని వెళ్తుంటారని అన్నాడు. తాను సినీ హీరోగా ఉన్నప్పుడు మిస్స్డ్ కాల్స్, పోకిరి పోలీస్, బీటెక్ లవ్ వంటి సినిమాల్లో హీరోగా నటించానని ఆయన చెప్పాడు. ఆ సమయంలో మనశ్శాంతి కోసం డ్రగ్స్, మద్యం తీసుకునేవాడినని తెలిపాడు. అయితే క్రైస్తవం స్వీకరించిన తరువాత అలాంటి అలవాట్లు మానేశానని చెప్పాడు.