: చంద్రబాబును కలిసిన పీవీ సింధు.. సంపూర్ణ సహకారం అందిస్తామన్న సీఎం!
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు తన కోచ్ పుల్లెల గోపీచంద్ తో ఏపీ సీఎం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా తాను సాధించిన పతకాన్ని ఆయనకు చూపించింది. సింధును అభినందించిన చంద్రబాబు, ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుపై గోపీచంద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా ఈ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.