: మహారాష్ట్ర మంత్రి మానవత్వం.. వరదల్లో చిక్కుకున్న వారిని తన ఇంటికి పిలిచిన మంత్రి!
ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్ర మంత్రి గిరీశ్ బపత్ తన మానవత్వం చాటుకున్నారు. తన నివాసానికి పరిసరాల్లో ఉన్న ఫోర్ట్, మంత్రాలయ దగ్గర చిక్కుకుపోయిన ప్రజలను తన ఇంటికి వచ్చి సేద తీరాల్సిందిగా కోరారు. ఈ మేరకు గిరీశ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ప్రజలకు విన్నవించుకున్నారు. కాగా, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.