: హైదరాబాద్, కేపీహెచ్బీ కాలనీలో ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య!
హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఈ రోజు కలకలం చెలరేగింది. ఆ కాలనీలో చెర్రిస్ ఫ్యాషన్ డిజైనర్స్ షాపు నడుపుతున్న స్రవంతి (35) అనే మహిళ ఫ్యానుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన షాపులోనే ఆమె ఈ ఘటనకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ షాపులో ఆత్మహత్య లేఖ లభ్యం కానట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.