: సన్నాహాలు ప్రారంభించిన అమెరికా.. ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అగ్రరాజ్యం!
జపాన్ మీదుగా ఖండాంతర క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా, ఉత్తరకొరియా దూకుడు వైఖరికి కళ్లెం వేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సన్నాహాలు ప్రారంభించింది. హవాయి తీరంలో అమెరికా వాయుసేన, క్షిపణి భద్రతా ఏజెన్సీ లు ఈ రోజు మధ్యతరహా ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించాయి. యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించాయి. కాగా, అమెరికాపై అణుబాంబులు వేయగలమని, అమెరికా మిత్ర దేశాలైన దక్షిణకొరియా, జపాన్ పై బాంబులు వేస్తామని, పసిఫిక్ సముద్ర తీరంలోని గువామ్ ద్వీపాన్ని నాశనం చేస్తామని బెదిరిస్తున్న ఉత్తరకొరియాపై అమెరికా మండిపడుతోంది. ఆ ద్వీపాన్నికనుక నాశనం చేస్తే, ప్రపంచ పటంలో ఉత్తరకొరియా అనేది లేకుండా చేస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది.