: మంత్రి మహేందర్ రెడ్డి ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త.. పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ సభలో కలకలం చెలరేగింది. ఈ సభకు మంత్రి మహేందర్ రెడ్డి కూడా వచ్చారు. ఓ వైపు సభ జరుగుతుండగానే మరోవైపు ఓ టీఆర్ఎస్ కార్యకర్త తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు మంటలు ఆర్పేసి, చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఆ కార్యకర్త శరీరం అధిక భాగం కాలిపోయింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు కార్యకర్త పేరు అయూబ్‌ఖాన్ అని సమాచారం. ఆయన ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై సమాచారం అందాల్సి ఉంది.