: పెద్దనోట్ల రద్దు వివరాలు వెల్లడించిన ఆర్‌బీఐ
గత ఏడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు నిర్దేశించిన గడువులో ఆ నోట్లను బ్యాంకుల వద్ద డిపాజిట్ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించి, వాటి స్థానంలో కొత్త నోట్లను కూడా తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలపై ఆర్‌బీఐ ఈ రోజు వివరణ ఇచ్చింది. వాటికి సంబంధించిన వివరాలతో 2016-17 వార్షిక నివేదికను విడుదల చేసింది.
ఆర్‌బీఐకి చేరిన పాత నోట్లు రూ.15.28 లక్షల కోట్లు. వాటిల్లో 632.6 కోట్ల రూ. 1000 నోట్లలో ఇంకా 8.9 కోట్ల నోట్లు వెనక్కి రాలేదు. అంటే రద్దు చేసిన రూ.1000 నోట్లు 99 శాతం ఆర్బీఐకి వచ్చాయి. రద్దు కాకముందు దేశంలో మొత్తం 1716.5 కోట్ల రూ.500 నోట్లు, 685.8 కోట్ల రూ.1000 నోట్లు చలామణీలో ఉండేవి. ఆ మొత్తం నోట్ల విలువ దాదాపు రూ.15.44 లక్షల కోట్లు.