: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని దారుణంగా హత్యచేసిన భర్త
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దారుణంగా హత్యచేసిన ఘటన తమిళనాడులోని దిండుగల్ జిల్లా కోటయంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో వినోద్ కుమార్, కుమారి (35) దంపతులు నివసిస్తున్నారు. అయితే, వారి మధ్య సంతోష్ అనే వ్యక్తి చిచ్చుపెట్టాడు. కుమారితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంతోష్.. వినోద్ లేని సమయంలో ఆమెను కలిసి వెళ్లేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వినోద్ తన భార్యను హెచ్చరించాడు.
అయినా ఆమె మాట వినలేదు. దీంతో సంతోష్‌ను చంపేయాలని అతను నిర్ణయించుకున్నాడు. సంతోష్ కు ఫోన్ చేసి తన ఇంటికి రావాలని చెప్పమని తన భార్యను బెదిరించాడు. తన భర్త చెప్పినట్లే ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మంది. దీంతో సంతోష్ తన ఇంటికి రాగానే వినోద్ ఇనుపరాడ్‌తో కొట్టి చంపేసి, అతడి శరీరాన్ని ముక్కలుగా నరికివేసి గోనె సంచిలో కట్టాడు. అనంతరం దాన్ని తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాడు. చెత్తకుండీలోని గోనె సంచీలోంచి దుర్వాసన వస్తుందని తెలుసుకున్న స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు వినోద్‌కుమార్ దంపతులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.