: సీఎం కేసీఆర్‌ను కలిసిన యాంకర్ ఉదయభాను!
ఈ రోజు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని యాంకర్ ఉదయభాను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. కేసీఆర్ లాంటి డైనమిక్ లీడర్‌ను కలవడం పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా కేసీఆర్‌తో దిగిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. కేసీఆర్ తమను ఆశీర్వదించారని పేర్కొంది. ఉదయభాను కవల పిల్లల తొలి పుట్టినరోజు వేడుక వచ్చేనెల 3న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ సందర్భంగానే ఆమె కేసీఆర్‌ను కలిసి, ఆ వేడుకకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.