: దొంగతనం చేయడానికి విశ్వప్రయత్నం చేశారు... కుదరకపోవడంతో తోకముడిచారు... వీడియో చూడండి!
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆభరణాల షోరూంలో దొంగతనం చేయడానికి ముగ్గురు దొంగలు వచ్చారు. సుత్తెలు పట్టుకొని షోరూం గాజు తలుపు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. ముగ్గురు కలిసి తమ సుత్తులతో తలుపును బాదడం ప్రారంభించారు. ఎన్ని సార్లు కొట్టినా చీలికలు పడుతోందే తప్ప గాజు పగలడం లేదు. కాలితో తన్నారు, కోపంగా సుత్తులతో దాడి చేశారు, అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తోకముడిచి, అక్కడి నుంచి పారిపోయారు. జూన్ 5న జరిగిన ఈ దొంగతనం సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు ఇటీవల విడుదల చేశారు. తలుపు పగలగొట్టడానికి దొంగలు పడుతున్న కష్టాన్ని మీరు కూడా చూడండి.