: అభిమానులారా! ‘ట్విటర్’లో నా ఖాతా ప్రారంభించా..ఇక, ట్వీట్స్ చేయండి: విజయ్ దేవరకొండ


హీరో విజయ్ దేవరకొండ తన ట్విటర్ ఖాతాను ప్రారంభించాడు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తన అభిమానులకు విజయ్ దేవరకొండ చెప్పాడు. తన అఫిషియల్ ట్విటర్ ఖాతాను ప్రారంభించానని, తనకు ట్వీట్ చేయమని తన పోస్ట్ లో విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ తో పాటు తన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ను కూడా తన అభిమానులతో పంచుకున్నాడు.

కాగా, విజయ్ దేవరకొండ ట్విటర్ లో తన ఖాతా ప్రారంభించడంపై నెటిజన్లు స్పందిస్తూ, ‘నేను కూడా ట్విటర్ ఖాతా తెరుస్తాను’, ‘మీరు ట్విట్టర్ ఖాతా తెరిస్తే బాగుంటుందని నిన్ననే చర్చించుకున్నాం’, ‘నీ కోసం ‘ట్విటర్’ కూడా ఫాలో అప్ చేయాలా?’, ‘బ్రో, థ్యాంక్యూ. ట్వీట్ రెగ్యులర్లీ. నీకు వీరాభిమానిని నేను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News