: 60 సెకన్లలో 51 పుల్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డు... వీడియో చూడండి
ఒక నిమిషంలో 51 పుల్ అప్స్ చేసి అమెరికాకు చెందిన ఆడమ్ సాండల్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గతంలో ఉన్న నిమిషంలో 50 పుల్ అప్స్ రికార్డును సాండల్ బ్రేక్ చేశాడు. ఎప్పటికైనా పుల్ అప్స్ చేయడంలో గిన్నిస్ రికార్డు తనదే ఉండాలని, అందుకు ఎంతటి కృషి చేయడానికైనా సిద్ధమేనని 31 ఏళ్ల సాండల్ తెలిపాడు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే పుల్ అప్స్ ఎలా పడితే అలా చేస్తే కుదరదు. ఎక్సర్‌సైజ్ చేస్తున్నంతసేపు శరీరం నిటారుగా ఉండటం, దవడ భాగం ఎప్పుడూ పైకే ఉండటం వంటి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలు పాటించకపోవడంతో నిమిషం వ్యవధిలో సాండల్ 53 పుల్ అప్స్ చేయగా రెండింటిని తిరస్కరించి 51గా గిన్నిస్ బృందం నమోదు చేసింది.