: ఈ రోజు పడిపోయిన బంగారం ధర!
నిన్న ఊహించని విధంగా ఒక్కసారిగా పెరిగిపోయిన పసిడి ధర ఈ రోజు మాత్రం పది గ్రాములకు ఏకంగా రూ.350 తగ్గిపోయి, రూ.30,100గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం, స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బంగారం ధర పడిపోయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే పయనించి ఈ రోజు రూ.500 తగ్గి, కేజీ వెండి ధర 40,600కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు 0.07 శాతం తగ్గి ఔన్స్‌కు 1,308.60 డాలర్లకు చేరింది. వెండి ధరలు 0.43 శాతం పడిపోయి ఔన్స్‌కు 17.35 డాలర్లుగా నమోదైంది.