: జగన్ ఓ సైకో.. ఆయనను ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు!: పరిటాల సునీత
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక సైకో అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. జగన్ ను ఏపీ ఓటర్లు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలుస్తుందని చెప్పారు. 2019లో చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని అన్నారు.