: వరంగల్‌లోని 'నిట్'లో డ్రగ్స్‌ అలజడి.. పోలీసులకి దొరికిపోయిన బీటెక్ విద్యార్థులు!


తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ కేసులో దొరికిన నిందితుల నుంచి స‌మాచారం అందుకుంటున్న పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు వరంగల్‌ లోని 'నిట్' కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిజ్జు, రమేష్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిరువురూ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తేల్చిచెప్పారు. ఆ విద్యార్థుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిందితుల‌ను రిమాండ్ కు తరలించామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News