: రక్షణ రంగాన్ని పటిష్టపరిచే అంశాలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రక్షణ రంగాన్ని పటిష్టపరిచే అంశాలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అధికమవుతోన్న తరుణంలో రక్షణ రంగాన్ని పటిష్టపర్చాలని నిర్ణయించింది. దాదాపు 57 వేల మంది మాజీ ఉద్యోగులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోవాలని యోచిస్తోంది. అలాగే యుద్ధ సామర్థ్యం పెంచుకోవడం, రక్షణ రంగంలో ఖర్చుల నియంత్రణ వంటి అంశాలపై అధ్యయనం కోసం సలహా కమిటీని నియమించిందని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న ఇతర నిర్ణయాలు...
- ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో సమతుల్యత పాటించేందుకు ఓబీసీ కోటాను అమలుపర్చాలని నిర్ణయం
- కేంద్ర ఎన్నికల సంఘం పలు దేశాల ఎన్నికల వ్యవస్థలు, ఆయా దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)కు ఆమోదం
- భారత్-కెనడా సంబంధాలు, దీపావళి పండుగలపై రెండు స్మారక పోస్టల్ స్టాంపులు విడుదలకు నిర్ణయం
- ఇజ్రాయెల్, బ్రెజిల్, మయన్మార్‌లతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందాలకు ఆమోదం
- జీఎస్‌టీ చట్టం కింద 15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్యూవీలపై సెస్ పెంపునకు ఆమోదం