: `బిగ్‌బాస్` నుంచి బయటికొచ్చినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు... రజనీకాంత్‌తో పోటీ పడుతున్న ఓవియా!
మానసిక సమస్యల కారణాలతో `తమిళ బిగ్‌బాస్` కార్యక్రమం నుంచి బయటకొచ్చినా ఓవియా హెలెన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. కార్యక్రమంలో ఉండగానే ఆమెకు మద్దతుగా `ఓవియా ఆర్మీ` అంటూ అభిమానులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె ఒక్క ట్వీట్ చేసినా `ఓవియా ఆర్మీ` దాన్ని రీట్వీట్లు, లైకులు చేస్తూనే ఉంది. `బిగ్‌బాస్` నుంచి వచ్చాక ఆమె చేసిన మొదటి ట్వీట్‌కు 56 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ ట్వీట్‌ను 15వేల మందికి పైగా నెటిజన్లు రీట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్‌కి కూడా ఇన్ని రీట్వీట్‌లు రాకపోవడం గమనార్హం. `బిగ్‌బాస్` తమిళ్‌లో ఆమె ప్రవర్తించిన తీరు ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. `ఓవియా ఆర్మీ` అనేది ఇప్పుడు తమిళనాడులో ఓ ట్రెండ్‌గా మారింది. కొంతమంది అభిమానులు `ఓవియా ఆర్మీ` పేరుతో టీషర్టులు, టోపీలు కూడా ధరించి కనిపిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాట ఆమెకు `తలైవి ఓవియా` అనే బిరుదు కూడా ఇచ్చారు.