: లోక్ పాల్ నియామకం విషయంలో మోదీకి అన్నా హజారే హెచ్చరిక!


దేశంలో పాతుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తాజాగా ప్రధాని మోదీకి ఓ హెచ్చరిక జారీ చేశారు. లోక్ పాల్ నియామకంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... లోక్ పాల్ కోసం మరోసారి తీవ్ర ఉద్యమాన్ని చేపడతానని హెచ్చరిస్తూ మోదీకి లేఖ రాశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయినా... లోక్ పాల్ నియామకంలో జాప్యం జరుగుతోందంటూ లేఖలో ఆయన విమర్శించారు.

 అవినీతిని అంతమొందించేందుకు ఇంతవరకు పటిష్టమైన చట్టాన్ని కూడా రూపొందించలేదని అన్నారు. కేంద్రంలో లోక్ పాల్ ను నియమించడమే కాకుండా, ప్రతి రాష్ట్రంలో లోకాయుక్తను నియమించాలని డిమాండ్ చేశారు. లోక్ పాల్ తో పాటు రైతు సంక్షేమం, ఆహార భద్రత గురించి వివరిస్తున్న స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు కోసం కూడా తాము ఉద్యమిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News