: అమెరికా మాకు ఇచ్చింది బిలియ‌న్ డాల‌ర్లు కాదు.. ప‌ల్లీలు!: పాకిస్థాన్ మాజీ మంత్రి


‘అమెరికా మాకు బిలియ‌న్ డాల‌ర్లు ఇచ్చిందా? ప‌ల్లీలు ఇచ్చింది’ అని పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి నిస్సార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తాము ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌కు సహకరించినందుకు గానూ పాక్‌కు బిలియన్‌ డాలర్ల నిధులు ఇచ్చామ‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన పాక్‌ మాజీ మంత్రి చౌదరి నిస్సార్ ఇలా వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో పాకిస్థాన్‌కు అమెరికా అందించిన ఆర్థిక సాయం వివరాలు వెల్లడించాలని త‌మ‌దేశ‌ నేషనల్‌ అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. ట్రంప్ చెబుతున్న‌ట్లు పాకిస్థాన్‌లో ఉగ్ర‌వాద శిబిరాలేమీ లేవ‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News