: సూర్య‌గ్ర‌హ‌ణం ద‌గ్గ‌ర్నుంచి ఎలా ఉంటుందో తెలుసా?


అమెరికాలో క‌నిపించిన సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణాన్ని స‌ద‌ర‌న్ రీసెర్చి సంస్థ ఫొటో తీసింది. అమెరికా అంత‌రిక్ష కేంద్రం నాసా వారి హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో దీనిని తీసింది. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల ఆధారంగా తీసిన ఈ ఫొటోలో సూర్యుని క‌రోనా భాగం, ఉప‌రిత‌లాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయ‌ని, ఇప్ప‌టికే కొన్ని కొత్త విష‌యాల‌ను వీటి ద్వారా తెలుసుకున్నామ‌ని, త్వ‌ర‌లోనే మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసి సూర్యుని గురించి తెలుసుకునే అవ‌కాశ‌ముంద‌ని ప‌రిశోధ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బ్రిమింగ్‌హామ్ ప్రాంతంలో స‌ద‌ర‌న్ రీసెర్చి వారు అత్యాధునిక కెమెరాలు, ఇన్‌ఫ్రారెడ్ ప‌రికరాల‌తో శాస్త్ర‌వేత్త‌లకు అవ‌స‌ర‌మైన ఫొటోల‌ను తీసి స‌మ‌కూరుస్తారు.

  • Loading...

More Telugu News