: మా లెజెండరీ మామగారు... ఆయన అందమైన కుమారుడు!: నమ్రతా శిరోద్కర్ 'ఫోటో' క్యాప్షన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాను, తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రాంలో ఆసక్తికరమైన ఫోటో పోస్టు చేసింది. ఈ ఫోటో మహేష్ బాబు అభిమానులను ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ కృష్ణ యువకుడిగా ఉన్నప్పటి ఫొటోకు, ‘స్పైడర్’ షూటింగ్ స్పాట్ లో మహేశ్ దిగిన ఫొటోను జత చేసింది. ఈ ఫోటోకు ‘అప్పుడు.. ఇప్పుడు. మా లెజెండరీ మామగారు, ఆయన అందమైన కుమారుడు’ అన్న వ్యాఖ్యను నమ్రత జతచేసింది. ఈ ఫోటో వారి అభిమానులను ఆకట్టుకుంటోంది.