: అభిమానులకు నిరాశ... 'జై లవ కుశ' ఆడియో రిలీజ్ వేడుక రద్దు!
వచ్చే నెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను తాకేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ కొత్త చిత్రం 'జై లవకుశ' ఆడియో విడుదల వేడుక 3వ తేదీన జరపాలని తొలుత నిర్ణయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్, ఇప్పుడా వేడుకను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి, నందమూరి అభిమానులను నిరాశలో ముంచింది. ఓ వైపు గణేశ్ మండపాలు కొనసాగుతుండటం, నిమజ్జనం సమయం కావడం, భారీ వర్షాలు పడుతూ ఉండటం తదితర కారణాలతో ఆడియో రిలీజ్ వేడుకను జరపరాదని నిర్మాతలు భావించినట్టు సమాచారం.
అభిమానుల క్షేమాన్ని కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇక అదే రోజున ఆడియో మార్కెట్లోకి డైరెక్టుగా విడుదల అవుతుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ కొద్దిసేపటి క్రితం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అభిమానుల కోసం 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించి అదే రోజున ట్రయిలర్ ను విడుదల చేస్తామని తెలిపింది.