: ఆ రాత్రి శ్రియను నిద్రపోనివ్వలేదు.. ఆటపట్టిస్తూనే వున్నాను : బాలకృష్ణ


పైసా వసూల్ సినిమా షూటింగ్ ప్రమోషన్ లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన విశేషాలు మీడియాతో పంచుకుని సినిమాపై హైప్ ను పెంచుతున్నారు. తన కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి సినిమా చేయలేదని ఆయన చెప్పారు. ఈ సినిమా ఆరంభంలో నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంటుందని, తరువాత నెమ్మదిగా పుంజుకుని అద్భుత విజయం సాధిస్తుందని ముందే ఊహించానని ఆయన అన్నారు. తాను ఊహించినట్టే సినిమా మొదట నెగిటివ్ టాక్ సంపాదించుకుందని బాలయ్య చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు చూద్దామా? ఎంత తొందరగా విడుదలవుతుందా? అని అంతా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా గడిచిందని ఆయన చెప్పారు.

 ఓరోజు విదేశాల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో షూటింగ్ స్పాట్ లో స్లీపింగ్ బ్యాగ్ లో దూరి శ్రియ నిద్రపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. షూటింగ్ కోసం యూనిట్ మొత్తం పనిలో ఉంటే శ్రియ పడుకుండిపోతుండడంతో బ్యాగ్ లో దూరి జిప్పేసుకున్న ఆమె దగ్గరకి తాను వెళ్లానని, తరువాత బ్యాగ్ పై నుంచి భుజంపై సరదాగా కొట్టానని అన్నారు. దీంతో బ్యాగ్ లోంచి బయట ఎవరు? అలా చేస్తున్నారని శ్రియ విసుక్కునేదని, మళ్లీ కాసేపు మౌనంగా ఉండి, మళ్లీ ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేసేవాడినని ఆయన చెప్పారు. దీంతో ఆ రాత్రంతా శ్రియ నిద్రపోలేదని, తరువాత తనను చూసి సారీ చెప్పిందని బాలయ్య నవ్వుతూ వెల్లడించారు. 

  • Loading...

More Telugu News