: అనవసరంగా నోరు జారకు: జగన్ కు ఎమ్మెల్యే చింతమనేని సూచన
లెక్కలేని విధంగా నోరు జారి మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో వైసీపీ అధినేత జగన్ ఒక్కసారి ఆలోచించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఒక స్థాయిలో ఉన్న నాయకులు అనవసరంగా, ఏది పడితే అది మాట్లాడకూడదని... ఏదైనా ఆరోపణ చేసినా ఓ పద్ధతి ప్రకారమే చేయాలని తెలిపారు. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మన వయసు ఏంటో కూడా చూసుకోవాలని చెప్పారు. ఇకనైనా నోటిని హద్దులో ఉంచుకోవాలని... అనవసరంగా నోరు జారవద్దని జగన్ కు సూచించారు. ఈరోజు ఆయన తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడలో కూడా నంద్యాల ఫలితమే పునరావృతం అవుతుందని చెప్పారు.