: 'ఎంసీఏ' సినిమా షూటింగ్: సాయి పల్లవితో హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తున్న నాని... చుట్టుముట్టిన అభిమానులు!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి జోరుమీదున్నాడు. తాజాగా 'నిన్ను కోరి' సినిమాతో వరుస విజయాలు అందుకున్న నాని, వరంగల్ జిల్లా హన్మకొండ రోడ్ పై 'ఫిదా' ఫేం సాయిపల్లవితో యమహా ఆర్ఎక్స్ 100 బైక్ పై షికార్లు కొడుతున్నాడు. హన్మకొండ గ్రీన్ స్క్వేర్ ప్లాజా సమీపంలో వీరిద్దరూ బైక్ పై రోడ్డు మీదకి వచ్చారు. అలా వెళ్తున్న వారిని చూసి అభిమానులు ఆశ్చర్యానందాలతో కేరింతలు కొట్టారు. అయితే షూటింగ్ సిబ్బంది వారిని నిలువరించారు. ప్రస్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా షూటింగ్ హన్మకొండలో జరుగుతోంది. అందులో భాగంగా ఓ సన్నివేశాన్ని ఇలా చిత్రీకరించారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు.