: వైసీపీ సభకు డుమ్మా కొట్టిన ఇద్దరు నేతలు.. ఫ్లెక్సీలు కట్టినా గైర్హాజరు!


నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన సభకు మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు గైర్హాజరు కావడం... ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత జగన్ తెరపైకి తీసుకొచ్చిన 'నవరత్నాలు' హామీల కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న స్థానిక ఆర్ఎస్ఆర్ కల్యాణమంటపంలో ఈ సభ జరిగింది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ సభకు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. గైర్హాజరైన ఇద్దరు నేతలకూ ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా కట్టారు. అయినప్పటికీ, వీరిద్దరూ గైర్హాజరు కావడంతో... పార్టీలోని విభేదాలు మరోసారి వెలుగు చూసినట్టైంది.

సభలో వైసీపీ నేతలు ప్రసంగిస్తూ, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. నల్లధనాన్ని పంచి గెలుపొందడం నిజమైన గెలుపు కాదని అన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను ఇంటింటా ప్రచారం చేస్తామని... 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News