: కవలల ఫొటో షేర్ చేసిన కరణ్ జొహార్.... వైరల్ అవుతున్న ఫొటో!
అద్దెగర్భం ద్వారా జన్మించిన తన ఇద్దరు కవలల ఫొటోను నిర్మాత కరణ్ జొహార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. `మై వరల్డ్ 2.0` అనే క్యాప్షన్‌తో కరణ్ తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముద్దులొలికే ఈ రూహీ, యశ్‌ల ఫొటోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. వారు పుట్టినప్పటి నుంచి కరణ్ షేర్ చేసిన రెండో ఫొటో ఇది. పిల్లలకు ఆరు నెలలు వచ్చిన సందర్భంగా రాఖీ పండుగ రోజున వారి మొదటి ఫొటోను కరణ్ పోస్ట్ చేశాడు. రూహీ, యశ్‌లకు సంబంధించి ఏ చిన్న ఫొటో షేర్ చేసినా నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.