: ఫేస్‌బుక్ అధినేత ఇంటికి మ‌రో పాపాయి... ఫొటో షేర్ చేసిన మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్


త‌న ఇంటికి మ‌రో పాప వ‌చ్చిందంటూ కూతురు పుట్టిన విషయాన్ని ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వెల్ల‌డించారు. త‌న భార్య ప్రిసిల్లా చాన్‌ పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మనిచ్చింద‌ని ఆయ‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వారి మొద‌టి కూతురు మాక్సిమా 2015లో జ‌న్మించిన‌పుడు కూతుర్ని లోకంలోకి ఆహ్వానిస్తూ త‌ల్లిదండ్రులిద్ద‌రూ ఓ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ పాప‌ను కూడా ఆహ్వానిస్తూ వారు లెట‌ర్ రాశారు.

`పాప‌గా ఉండే అవ‌కాశం జీవితంలో ఒక్క‌సారే వ‌స్తుంది. భవిష్య‌త్తు గురించి ఆలోచించ‌కుండా ప‌సి వ‌య‌సును ఆస్వాదించు. నీ భ‌విష్య‌త్తు గురించి చింతించే అవ‌కాశాన్ని మాకివ్వు. నీ లాంటి పిల్ల‌ల కోసం ప్ర‌పంచాన్ని గొప్ప‌గా మార్చే అవకాశాన్ని మాకివ్వు` అని వారు లేఖ‌లో పేర్కొన్నారు. త‌మ కంటే మంచి జీవితాన్ని అనుభ‌వించే హ‌క్కు వాళ్ల కూతురి త‌రానికి ఉంద‌ని, దాన్ని నిజం చేసే బాధ్య‌త‌ను తాము నిర్వ‌ర్తిస్తామ‌ని మార్క్ దంప‌తులు తెలియ‌జేశారు.

  • Loading...

More Telugu News